NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రభాస్ సలార్ నుండి సాలిడ్ అప్డేట్
    తదుపరి వార్తా కథనం
    ప్రభాస్ సలార్ నుండి సాలిడ్ అప్డేట్
    ఈ నెలలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న సలార్

    ప్రభాస్ సలార్ నుండి సాలిడ్ అప్డేట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 07, 2023
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ - ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సలార్ పై అభిమానుల్లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కేజీఎఫ్ తో రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఎలా చూపిస్తాడోనన్న ఆతృత అందరిలోనూ ఉంది.

    గతకొన్ని రోజులుగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఊగిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.

    సలార్ మూవీ షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తవనుందని తెలుస్తోంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుందని, ఇదే నెలాఖర్లో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

    ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతాయని అంటున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

    ప్రభాస్

    సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతున్న సలార్

    ఈ సంవత్సరం ప్రభాస్ నుండి మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలోని ఆదిపురుష్ మూవీ జూన్ 16వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రకటన వచ్చింది.

    అలాగే సలార్ మూవీని సెప్టెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలియజేసారు. ఇంకా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజా డీలక్స్ మూవీ కూడా ఇదే సంవత్సరం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    అనుకున్న ప్రకారం అన్నీ రిలీజ్ అయితే ప్రభాస్ అభిమానులకు పండగనే అని చెప్పాలి.

    యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న సలార్ సినిమాను హోంబలే మూవీస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుండగా మరిన్ని ప్రధాన పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కనిపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా
    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో

    తెలుగు సినిమా

    "గాండీవధారి అర్జున" టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త చిత్రం సినిమా
    శాకుంతలం ప్రమోషన్స్: మల్లికా మల్లికా పాటకు విశేష స్పందన శాకుంతలం
    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి తలనొప్పిగా మారిన అమీర్ పేట్ మెట్రో సినిమా
    భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా? చిరంజీవి

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025