
సలార్ వర్సెస్ డంకీ: పోటీ నుండి తప్పుకోనున్న షారుక్ ఖాన్ డంకీ?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే రోజున షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా రిలీజ్ అవుతోంది.
రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదల కావడం వల్ల రెండు సినిమాలకు నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, డంకీ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అవును, రాజ్ కుమార్ హీరోని దర్శకత్వంలో తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల అయ్యే అవకాశం కనిపించట్లేదని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి.
Details
ఆలస్యమవుతున్న డంకీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు
డంకీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిసెంబర్ 22వ తేదీ వరకు పూర్తయ్యేలా కనిపించడం లేదట.
అదే కాదు సలార్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో డంకీ సినిమా విడుదలయితే దక్షిణాదిలో డంకీ సినిమాకు థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతానికి ఈ విషయమై ఇలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఒకవేళ డంకీ సినిమా పోస్ట్ పోన్ అయితే జనవరి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
డంకీ సినిమా వాయిదా పడితే ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాకు సోలో రిలీజ్ దక్కుతుంది. అదే జరిగితే సలార్ సినిమా కలెక్షన్లు విపరీతంగా ఉండనున్నాయి.