Page Loader
'సలార్'తో బాక్సాఫీసు రికార్డు బద్దలే.. టార్గెట్ 2వేల కోట్లు అంటూ కమెడియన్ ట్విట్
'సలార్'తో బాక్సాఫీసు రికార్డు బద్దలే.. టార్గెట్ 2వేల కోట్లు అంటూ కామెడియన్ ట్విట్

'సలార్'తో బాక్సాఫీసు రికార్డు బద్దలే.. టార్గెట్ 2వేల కోట్లు అంటూ కమెడియన్ ట్విట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 09, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సలార్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ టీజర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు, డైలాగ్స్ వంటి సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సినిమాపై ఈ టీజర్ భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. టీజర్ రెండు రోజుల్లోనే వంద మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా రెండు వేల కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందని టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ట్విట్ చేశాడు. ఈ సినిమాలో అతను కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Details

ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకున్న సలార్ మూవీ 

సలార్ సినిమాకు సంబంధించి సప్తగిరి డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేశాడు. ఈ క్రమంలో డబ్బింగ్ స్టూడియోలోని ఫోటోను పోస్టు చేస్తూ సలార్ సినిమా 2వేల కోట్లు దాటుతుందని చెప్పారు. ప్రస్తుతం సప్తగిరి చేసిన ట్విట్ వైరల్‌గా మారింది. సలార్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. సినిమా రిలీజ్‌కు నెలరోజుల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా సలార్ సినిమాను ఇంగ్లీష్ బాషలో రిలీజ్ చేయాలని హోంబలే సంస్థ గట్టి ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ఈ సినిమాతోనైనా సూపర్ హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.