LOADING...
Salim Akhtar : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సలీమ్ అక్తర్ మృతి.. 
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సలీమ్ అక్తర్ మృతి..

Salim Akhtar : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సలీమ్ అక్తర్ మృతి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు అనారోగ్య కారణాలతో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. బాలీవుడ్‌లో ఇటీవలే ఒక ప్రముఖ దర్శకుడు,నటుడు మృతి చెందగా, తాజాగా ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. గత కొంత కాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని ధీరూభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీసలీమ్ కుటుంబ సభ్యుల అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఆయన భౌతికదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరుకానున్నారు.

వివరాలు 

రాణీ ముఖర్జీ, తమన్నా సినీ పరిశ్రమకు పరిచయం

బాలీవుడ్‌కు ఎన్నో సేవలు చేసిన సలీమ్ అక్తర్.. 1983లో విడుదలైన ఖయామత్, 1993లో వచ్చిన ఫూల్ ఔర్ అంగారే, ఆద్మీ, 1997లో విడుదలైన రాజా కీ ఆయేగీ బారాత్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా, రాణీ ముఖర్జీ, తమన్నా వంటి ప్రఖ్యాత హీరోయిన్‌లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనది. అలాగే, అమీర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ హీరోలను కూడా ఆయనే తొలి అవకాశాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

వివరాలు 

బాలీవుడ్ ఇండస్ట్రీకి లెజెండ్ నిర్మాత

సలీమ్ అక్తర్‌ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు లెజెండ్ నిర్మాతనే చెప్పాలి. ఆయన మృతి పరిశ్రమలోని అనేక ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయనను సన్నిహితంగా తెలిసినవారు, సహచరులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన కుటుంబానికి ఓదార్పు మాటలు చెబుతున్నారు.