Mythri Movie Makers: సూపర్‌హీరోగా సల్మాన్ ఖాన్.. మైత్రి మూవీ మేకర్స్ హై-కాన్సెప్ట్ ప్రాజెక్ట్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఎప్పుడూ ప్రయత్నించన ఒక విభిన్నమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నారట. రాజ్ & డీకే దర్శకత్వంలో, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 'సూపర్‌హీరో కామెడీ'గా తెరకెక్కనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని భారీ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హాలీవుడ్ సూపర్‌హిట్ 'హ్యాంకాక్' (విల్ స్మిత్ నటించినది) నుంచి స్పూర్తి పొందినట్లు టాక్. కథా నేపథ్యం ఇలా ఉంది. సూపర్ పవర్స్ కలిగిన ఒక హీరో, ప్రపంచాన్ని రక్షించడంలో అలసిపోయి, ఆ బాధ్యతల నుంచి విరామం తీసుకోవాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితులు అతన్ని మళ్లీ యాక్షన్‌లోకి లాగుతాయి.
Details
భారీ ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్
రాజ్ & డీకే ప్రత్యేకతగా చూపించే షార్ప్ హ్యూమర్, హై-వోల్టేజ్ యాక్షన్, కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కనిపించనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నారు. గ్లోబల్ గుర్తింపు పొందిన 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' వంటి సిరీస్‌ల ద్వారా ప్రఖ్యాతి పొందిన రాజ్ & డీకే ఈ ప్రాజెక్ట్ ద్వారా సల్మాన్ ఖాన్‌ను ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ అతుల్ అగ్నిహోత్రి (రీల్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్)తో కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాల మేరకు విజయం సాధించలేకపోయడం వల్ల, ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు,
Details
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు
ముఖ్యంగా రాజ్ & డీకే వంటి వెర్సటైల్ డైరెక్టర్స్, మైత్రి మూవీ మేకర్స్ వంటి సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ భాగస్వామ్యంతో ఇప్పటివరకు, మైత్రి మూవీ మేకర్స్, రాజ్ & డీకే, సల్మాన్ ఖాన్ ఎవరూ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే 'టాక్ ఆఫ్ ది టౌన్'గా మారి, ప్రేక్షకుల మరియు సినీ వర్గాల ఉత్కంఠను పెంచింది.