Battle Of Galwan: తెలంగాణ వీరుడి పాత్రలో సల్మాన్ ఖాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టీజర్‌పై క్రేజీ అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొంతకాలంగా వరుస హిట్లు లేక సతమతమవుతున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన కెరీర్‌పై చర్చలు సాగుతున్నాయి. ఇటీవల ఆయన హీరోగా నటించిన 'సికందర్' సినిమా కూడా అదే కోవలో నిలిచింది. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హైప్ మధ్య థియేటర్లకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కమ్‌బ్యాక్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ ఓకే చేసిన తాజా చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ (Battle Of Galwan)'. ఈ సినిమాను దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నారు.
Details
హీరోయిన్‌గా చిత్రాంగద సింగ్
మిలిటరీ వార్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తైనట్లు సమాచారం. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సల్మాన్ ఖాన్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్థాయి స్పందన లభించింది. ఇదిలా ఉండగా, తాజాగా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ టీజర్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 27న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.
Details
త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన
ఇక 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' సినిమా కథ విషయానికి వస్తే, 2020లో భారత్-చైనా సరిహద్దులో చోటుచేసుకున్న గల్వాన్ లోయ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే, ఇది కూడా ప్రస్తుతం రూమర్‌గానే ఉంది. ఈ అంశంపై కూడా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, ఈ సినిమాకు సౌత్ ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.