LOADING...
Ram Charan: సల్మాన్ ఖాన్ బర్త్‌డే.. ధోని, రామ్ చరణ్, బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో!
సల్మాన్ ఖాన్ బర్త్‌డే.. ధోని, రామ్ చరణ్, బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో!

Ram Charan: సల్మాన్ ఖాన్ బర్త్‌డే.. ధోని, రామ్ చరణ్, బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతేడాది సల్మాన్ బర్త్‌డే అంటే బాలీవుడ్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది, కానీ ఈసారి ఉత్సాహం మరింత ఎక్కువగా కనిపించింది. అభిమానులు, సినీ, క్రీడా రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను ప్రత్యేకంగా మార్చారు. పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ తన కొత్త సినిమా టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. టీజర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బర్త్‌డే పార్టీ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ వేడుకలో బయటకు వచ్చిన ఓ ప్రత్యేక ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Details

ఆనందంలో అభిమానులు

ఆ ఫ్రేమ్‌లో సల్మాన్ ఖాన్, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్. ధోని, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కలిసి కనిపించారు. సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానుల్లో సంబరాన్ని రేపింది. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య ఉన్న మంచి స్నేహం తెలిసిందే. గతంలో కూడా వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. రామ్ చరణ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఈ స్నేహం మరింత బలపడిందని చెప్పుకుంటున్నారు. అలాగే బాబీ డియోల్ కూడా సల్మాన్‌కు సన్నిహితుడు. ఇది మాత్రమే కాదు, ఎం.ఎస్. ధోని కూడా అదే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌గా మారింది.

Details

సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండింగ్

సాధారణంగా సినిమా వేడుకలకు అరుదుగా హాజరయ్యే ధోని, సల్మాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ స్టార్‌తో కలిసి కనిపించడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఇది నిజమైన లెజెండ్స్ మీటింగ్, ఇండియన్ సినిమా, ఇండియన్ క్రికెట్ ఒకే ఫ్రేమ్‌లో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫ్రేమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Advertisement