Salman Khan: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి కాంబో ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడపల్లి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో చేతులు కలిపాడు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం దళపతి విజయ్‌తో 'వారసుడు' చిత్రం తెరకెక్కించిన ఆయన, ఈసారి సల్మాన్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం (మార్చి 30) వెలువడింది. చాలా కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్‌కు తెరదిస్తూ, సల్మాన్ ఖాన్ స్వయంగా తన ఎక్స్ (X) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
సల్మాన్ మాస్ ట్వీట్‌తో క్లారిటీ
ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అప్డేట్ ఇచ్చారు. తన సిగ్నేచర్ స్టైల్‌లో "దిల్, దిమాగ్, జిగర్ సే, ఫ్రమ్ దిస్ ఏప్రిల్" అనే క్యాప్షన్‌తో పోస్టు పెట్టారు. ఈ డైలాగ్‌నే చూస్తే సినిమాలో యాక్షన్, ఎమోషన్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతోంది. టాలీవుడ్ దర్శకుడు సల్మాన్ లాంటి మాస్ హీరోను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
దిల్ రాజు నిర్మాణం
ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎలాంటి రాజీ లేకుండా గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయనతో పాటు కుల్దీప్ రాథోడ్, రఫీ ఖాజీ కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్-బాలీవుడ్ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రొడక్షన్ విలువలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 2026 నుంచి షూటింగ్ ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని పనులు వేగంగా పూర్తి చేసి, భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
వివరాలు
2027లో గ్రాండ్ రిలీజ్ టార్గెట్
ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వంటి ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.