
నేడే ఓటీటీలోకి 'సామజవరగమన' సినిమా.. ఎన్ని గంటలకు వస్తుందంటే!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ విష్ణు, రెబా మోనికా జంటగా నటించిన సామజవరగమన ఈ మధ్య థియోటర్లలో కనెక్షన్ల వర్షం కురిపించింది.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఏకంగా 50 కోట్ల కలెక్షన్లు సాధించి ప్రముఖ హీరోల నుంచి ప్రశంసలను అందుకుంది.
దీంతో ఈ సినిమాను ఓటిటిలో చూసేందుకు ప్రేక్షకులు అతృతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇటీవల అధికార ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రకటించిన దాని కన్నా ముందుగానే ఈ మూవీని ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Details
నేడు సాయంత్రం 7 గంటలకు రిలీజ్
జులై 28 అర్ధరాత్రి నుంచి సామజవరగమన సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని ఆహా ఇటీవల ప్రకటించింది.
అయితే ప్రజల డిమాండ్ మేరకు జూలై 27న సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో సామజవరగమన రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో బాక్సఫీస్ బాలు క్యారెక్టర్ లో హీరో విష్ణు, అతడి తండ్రి పాత్రలో నరేష్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.
రాజేశ్ దండా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా, గోపీ సుందర్ సంగీతాన్ని సమకూర్చాడు.