సమంత పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది? ఇంటర్నెట్లో చర్చ రేపుతున్న పోస్ట్
సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. సమంత, నాగచైతన్య విడిపోతున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అయితే వాళ్ళిద్దరూ విడిపోయి చాలా కాలమైనా కూడా ఇంటర్నెట్లో వాళ్ళిద్దరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి వార్తే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు విషయం ఏంటంటే? నాగచైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఫ్రెంచ్ డాగ్ ఉండేది. అది సమంత పెంపుడు కుక్క అయినప్పటికీ నాగచైతన్యకి కూడా బాగా అలవాటయ్యింది. గత కొంతకాలం నుండి ఆ కుక్క సమంత దగ్గరే ఉంది. ప్రస్తుతం సడెన్ గా నాగచైతన్య వద్ద ఆ పెంపుడు కుక్క కనిపించింది.
నాగ చైతన్య వద్ద కనిపించిన పెంపుడు కుక్క
నాగచైతన్య వద్ద పనిచేసే ఒకానొక అబ్బాయి కొత్తగా బైక్ కొనుక్కున్నాడు. ఆ బైక్ పైన నాగచైతన్య ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ వీడియోను అతను ఇంటర్నెట్లో పంచుకున్నాడు. ఆ వీడియోలో సమంత పెంపుడు కుక్క కనిపించింది. దీంతో ఇంటర్నెట్లో మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. సమంత దగ్గర ఉండాల్సిన పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉందంటూ అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నాగ చైతన్య, సమంత మళ్ళీ కలుస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుందని అంటున్నారు. అదలా ఉంచితే నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇటు సమంత అమెరికాలో మయోసైటిస్ పై చికిత్స తీసుకుంటున్నారు.