Samantha : పెళ్లి తర్వాత విరామం తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటున్న నటి
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈనెల 1న వారి వివాహం జరిగింది.పెళ్లి అనంతరం ఎక్కువ విరామం తీసుకోకుండా సమంత తన వృత్తిలో తిరిగి నిమగ్నమయ్యారు. వివాహం తర్వాత నాలుగురోజుల్లోనే ఆమె తన కొత్తసినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. సమంత,తన సోషల్ మీడియా ఖాతా ద్వారా 'మా ఇంటి బంగారం'అనే సినిమాలో తన చిత్రీకరణ ప్రారంభమైందని తెలియజేశారు. మేకప్ రూమ్‌లో హెయిర్ స్టైలింగ్ చేస్తూ తీసిన ఫోటోను పంచుకోవడంతో "లెట్స్ గో #MaaIntiBangaram" అని క్యాప్షన్ పెట్టారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ముహూర్తపూజకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె అభిమానులతో షేర్ చేశారు. తన కొత్తప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరారు.
వివరాలు
2021లో విడిపోయిన సమంత-నాగ చైతన్య
సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరూ గతంలో విజయం సాధించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో కలిసి పనిచేశారు. ఇటీవల ఓ క్రీడా కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వారి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలను నిజం చేసుకుంటూ, వారు వివాహ బంధంలో ఒక్కటయ్యారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో రాజ్ నిడిమోరు సమంత గురించి మాట్లాడుతూ, ఆమె వృత్తి పట్ల చూపే అంకితభావాన్ని ప్రశంసించారు. సమంతను సరదాగా "ప్రాపర్ నెర్డ్"గా, పుస్తకాల పురుగు అని పేర్కొన్నారు. సమంత గతంలో నటుడు నాగ చైతన్యతో వివాహం చేసుకున్నారు, కానీ 2021లో వారు విడిపోయిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెళ్లయిన నాలుగో రోజే సెట్స్‌లో సమంత
Post-wedding, #Samantha kick-starts the shoot for #MaaIntiBangaram. pic.twitter.com/m0GrZfPVy0
— Hyderabad Times (@HydTimes) December 5, 2025