
Samantha - Raj Nidimoru: రాజ్ నిడిమోరు కుటుంబంతో సమంత దీపావళి సెలబ్రేషన్స్
ఈ వార్తాకథనం ఏంటి
నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు మరింత ఊతం చేకూర్చేలా, సమంత, రాజ్‌తో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. రాజ్ కుటుంబంతో కలిసి సమంత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాణసంచాలను కాలుస్తున్న ఫొటోలను షేర్ చేసిన సమంత, 'నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది' అని క్యాప్షన్ పెట్టారు. తరచుగా వీరిద్దరూ కలిసి కనిపిస్తుండటంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Details
డేటింగ్ వార్తలపై స్పందించని సమంత
రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' 'సిటాడెల్: హనీ బన్నీ'లో సమంత నటించిన సమయంలోనే రాజ్‌తో పరిచయం ఏర్పడింది. డేటింగ్ వార్తలపై వారు అధికారికంగా ఎక్కడా స్పందించకపోయినా, అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. సినిమాల విషయానికి వస్తే, సమంత చాలా రోజుల తర్వాత 'మా ఇంటి బంగారం' మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అదనంగా, సమంత 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం నటిస్తున్నారు.