తదుపరి వార్తా కథనం

శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత
వ్రాసిన వారు
Sriram Pranateja
Apr 04, 2023
01:32 pm
ఈ వార్తాకథనం ఏంటి
హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సహజీవనం చేస్తున్నారని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సమంత స్పందించినట్లు పుకార్లు వచ్చాయి.
నాకు కన్నీళ్ళను మిగిల్చిన వాళ్ళు ఎవరితో సహజీవనం చేస్తే నాకేంటి? ఎంతమందితో చేస్తే నాకేంటి? కనీసం సహజీవనం చేస్తున్న అమ్మాయైనా బాగుంటే చాలు అని నాగ చైతన్య, శోభిత సహజీవనంపై వస్తున్న వార్తలకు సమంత సమాధానం చెప్పినట్లుగా రాసుకొచ్చారు.
ఈ వార్తను ఖండించిన సమంత, నేను అసలు అలా అనలేదని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
2017 అక్టోబర్ లో సమంత, నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. కానీ 4సంవత్సరాల తర్వాత 2021 అక్టోబర్ లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తప్పుడు వార్తలపై సీరియస్ అయిన సమంత
I never said this!! https://t.co/z3k2sTDqu7
— Samantha (@Samanthaprabhu2) April 4, 2023