Samantha: సినిమాలతో కాదు.. కొత్తగా మరో వ్యాపారాన్ని ప్రారంభించిన సమంత!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటనతోపాటు వ్యాపార రంగంలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది. కొంతకాలం అనారోగ్యం కారణంగా సినిమాలకు విరామం తీసుకున్న ఆమె తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. వరుసగా చిత్రాలకు సంతకాలు చేసుకుంటూ, నిర్మాతగా మారింది. తాజాగా ఆమె మరో వ్యాపార యత్నాన్ని మొదలుపెట్టారు. సమంత తన కొత్త క్లాతింగ్ బ్రాండ్'Truly Sma'ని అధికారికంగా ప్రారంభించారు. ఈవిషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించి, 'ఒక కొత్త అధ్యాయం మొదలైంది' అనే క్యాప్షన్‌తో ప్రమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలతో మద్దతు తెలుపుతున్నారు. "వ్యాపారవేత్తగా కూడా సమంత రాణించాలని కామెంట్లు పెడుతున్నారు.
Details
ఫ్యాషన్ రంగంలో అనుభవం
ఇప్పటికే సమంతకు ఫ్యాషన్ రంగంలో ఒక అనుభవం ఉంది. ఆమె 'Saki' అనే బ్రాండ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇటీవలే పర్ఫ్యూమ్ వ్యాపారంలో కూడా అడుగు పెట్టారు. ఇప్పుడు 'Truly Sma' ద్వారా ఫ్యాషన్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఆమె ముందుకు వచ్చారు. సినీ కెరీర్ పరంగా కూడా సమంత బిజీగా ఉండటంతో పాటు, ఆమె 'Tralala Moving Pictures' పేరిట సొంత నిర్మాణ సంస్థ స్థాపించడంతో నిర్మాతగా కూడా పయనమవుతున్నారు. ప్రస్తుతం ఆమె నిర్మిస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'లో తానే ప్రధాన పాత్ర పోషిస్తోందని సమాచారం.
Details
రక్త బ్రహ్మాండ వెబ్ సిరీస్ లో సమంత
అదే చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో 'రక్త బ్రహ్మాండ' అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సమంత బహుముఖంగా క్రియాశీలంగా కొనసాగుతూ తాను ఆచరించే ప్రతి రంగంలో తన ముద్ర వేస్తున్నట్టు తెలుస్తోంది.