Samantha: రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా సమంత.. క్వారిటీ ఇచ్చేసిందిగా?
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ల గురించి సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల పలు ఈవెంట్లలో కలిసి కనిపించడంతో పాటు, విదేశీ ట్రిప్‌లలో, రెస్టారెంట్లలో కూడా జంటగా కనిపించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ఈ జంట ఓ ఈవెంట్‌లో కలిసి సందడి చేశారు.
Details
రాజ్‌ను హగ్ చేసిన సమంత
ప్రతి ఈవెంట్‌లోనూ సమంతకు రాజ్ తోడుగా ఉండడం ఇప్పుడు కామన్‌గా మారింది. విదేశాల్లోనూ వీరిద్దరూ తరచూ కలసి కనిపిస్తున్నారు. తాజాగా సమంత కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ మళ్లీ కలసి కనిపించగా, ఈసారి సమంత రాజ్‌ను హగ్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను సమంత స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో చర్చ మరింత వేడెక్కింది. ఈ ఫోటోతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారానికి బలం చేకూరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Details
సమంత స్పందన
ఫోటోలను షేర్ చేసిన సమంత, వాటికి అర్థవంతమైన క్యాప్షన్ జతచేశారు. "గత ఏడాదిన్నర కాలంలో నేను నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్‌దృష్టిని నమ్మడం నేర్చుకున్నాను. చిన్న విజయాలను జరుపుకుంటున్న ఈ క్షణంలో, అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే వ్యక్తులతో కలిసి పని చేయడం నాకు గర్వకారణం. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని సమంత రాసుకొచ్చారు.
Details
పెళ్లి వార్తలపై హల్‌చల్
ఈవెంట్‌లో క్లోజ్‌గా కనిపించిన సమంత-రాజ్ ఫోటోలతో ఇప్పుడు వీరి పెళ్లి అంశం సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది. రాజ్ తన భార్య శ్యామాలిదేతో విడాకులు తీసుకుంటున్నారని వార్తలు ముందే వినిపించాయి.ఇప్పుడు సమంతతో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. స్నేహం ఎలా మొదలైంది? సమంత, రాజ్ నిడిమోరు జంట స్నేహం 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 సమయంలో మొదలైంది. ఆ సిరీస్‌లో సమంత కీలక పాత్రలో నటించగా, రాజ్-డీకే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వీరిద్దరి స్నేహం మరింత బలపడింది.అనంతరం కూడా పలు ప్రాజెక్టుల్లో కలిసి పనిచేశారు. ప్రస్తుతం సమంత 'మా ఇంటి బంగారం' చిత్రంలో నటిస్తుండగా, తన కెరీర్‌లో కొత్త దశలో అడుగుపెడుతున్నారు.