LOADING...
Samantha: డిజిటల్‌లో సమంత మరో అడుగు.. సోనీలివ్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం
డిజిటల్‌లో సమంత మరో అడుగు.. సోనీలివ్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం

Samantha: డిజిటల్‌లో సమంత మరో అడుగు.. సోనీలివ్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోయిన్ సమంత మరోసారి డిజిటల్ రంగంలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్ తమిళంతో కలిసి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. సమంతతో భాగస్వామ్యం ప్రారంభమైనట్లు వెల్లడించిన సోనీలివ్, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ, ఈ ఏడాది తనకు మార్పులను స్వీకరించడం, ప్రయాణాన్ని విశ్వసించడం ఎంత ముఖ్యమో నేర్పిందని పేర్కొన్నారు. కొత్త అవకాశాలను ఎల్లప్పుడూ ఆహ్వానించాలని భావిస్తున్నానని, సోనీలివ్ తమిళంతో కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై పని జరుగుతోందని, దానికి సంబంధించిన వివరాలను త్వరలో అభిమానులతో పంచుకుంటానని ఆమె వెల్లడించారు.

వివరాలు

100 కోట్లకు చేరువలో సామ్ మూవీ..

డిజిటల్ వేదిక సమంతకు కొత్త కాదు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు, టాక్ షోల ద్వారా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ', 'సామ్‌జామ్' వంటి ప్రాజెక్ట్‌లతో ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే సోనీలివ్ కోసం ఆమె వెబ్ సిరీస్‌లో నటించనున్నారా, లేక కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం సోనీలివ్‌తో కలిసి పని చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' ఇటీవల జూన్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకుపైగా వసూళ్లు సాధించి విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

Advertisement