LOADING...
Samantha: ఆన్‌లైన్‌ వేధింపులపై పోరాటం.. యూఎన్ విమెన్‌తో కీలక భాగస్వామ్యం
ఆన్‌లైన్‌ వేధింపులపై పోరాటం.. యూఎన్ విమెన్‌తో కీలక భాగస్వామ్యం

Samantha: ఆన్‌లైన్‌ వేధింపులపై పోరాటం.. యూఎన్ విమెన్‌తో కీలక భాగస్వామ్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి సమంత, మహిళలపై ఆన్‌లైన్‌లో పెరుగుతున్న వేధింపులను ఎదుర్కోవడానికి ముందుకు వచ్చారు. ఈ లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న 'యూఎన్ విమెన్ ఇండియా'తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మహిళలపై డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న హింసను నివారించేందుకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకూ జరుగనున్న 16 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు సమంత ఇప్పటికే తెలియజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన 37 మిలియన్ల అనుచరులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె, ఆన్‌లైన్ వేధింపులపై తన అనుభవాలను వెల్లడించారు.

వివరాలు 

తాను కూడా అనేకసార్లు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడి 

"సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, బెదిరింపులు, డీప్ ఫేక్ చిత్రాలు వంటి అనేక రూపాల్లో మహిళలు దాడులకు గురవుతున్నారు. గతంలో ప్రత్యక్షంగా జరిగే ఈ వేధింపులు ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి మారాయి. ఇవి మనసును దెబ్బతీసేలా, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా ఉంటాయి," అని సమంత భావోద్వేగంతో తెలిపారు. తాను కూడా ఇలాంటి పరిస్థితులను పలుమార్లు ఎదుర్కొన్నానని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం మహిళల్లో ఆన్‌లైన్ హింసపై అవగాహన పెంపొందించడం అని సమంత వివరించారు. డిజిటల్ వేధింపులను అరికట్టేందుకు మరింత ప్రభావవంతమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు తప్పనిసరిగా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. యూఎన్ విమెన్ ఇండియా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు గర్వకారణమని సమంత పేర్కొన్నారు.