Page Loader
Samantha Cryotherapy: రికవరీ కోసం సమంత క్రియోథెరపీ.. ఇన్‌స్టో స్టోరీ వైరల్ 
Samantha Cryotherapy: రికవరీ కోసం సమంత క్రియోథెరపీ.. ఇన్‌స్టో స్టోరీ వైరల్

Samantha Cryotherapy: రికవరీ కోసం సమంత క్రియోథెరపీ.. ఇన్‌స్టో స్టోరీ వైరల్ 

వ్రాసిన వారు Stalin
Nov 04, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోయిన్ సమంత మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స తీసుకొని, ఇటీవల తిరిగి రెగ్యూలర్‌గా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అయితే ఇటీవల సమంత తన క్రియోథెరపీ సెషన్‌ను సంబంధించిన స్టోరీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీనికి రికవరీ అనే క్యాప్షన్ కూడా జోడించింది. మైయోసిటిస్ వ్యాధికి చికిత్సలో భాగంగానే సమంత క్రియోథెరపీ చెయించుకుంటోంది. క్రయోథెరపీ అనేది రోగనిరోధక వ్యవస్థను ఎలా మెరుగుపరుస్తుంది? ఎలా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది? ప్రయోజనకరమైన హార్మోన్ల విడుదలను ఎలా ప్రేరేపిస్తుందో సమంత వివరించింది. సమంత చివరగా నటించిన చిత్రం విజయ్ దేవరకొండతో నటించిన 'ఖుషి'.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సమంత క్రియోథెరపీ దృశ్యాలు