Samantha Wedding: వివాహ బంధంలోకి సమంత-రాజ్ నిడిమోరు.. సినీ సెలెబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రనటి సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి ఆలయంలో సమంత-రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో సమంత ఎర్రచీరలో, రాజ్ క్రీమ్-గోల్డ్ కుర్తాలో అందంగా మెరిశారు. ఈ వేడుక ఫొటోలను సమంత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
Details
'భూత శుద్ధి వివాహం' విధానంలో పెళ్లి
సమంత-రాజ్ వివాహానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వీరు 'భూత శుద్ధి వివాహం' ప్రకారం పెళ్లి చేసుకున్నారని స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక యోగ సంప్రదాయం గురించి ఆసక్తి పెరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి జరిగింది. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతిక పరిమితులను దాటి, వధూవరుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన అరుదైన యోగ క్రతువు. లింగ భైరవి ఆలయాలు, ప్రత్యేకంగా నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే జరిగే ఈ వివాహం ద్వారా వధూవరుల శరీరాల్లోని పంచభూతాలు శుద్ధి అవుతాయని చెబుతారు. దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వికసించేలా దేవి అనుగ్రహం లభిస్తుందని ఈశా ఫౌండేషన్ తెలిపింది.
Details
గతంలో సమంత-రాజ్ మధ్య పెరిగిన స్నేహం
ఇటీవలి కాలంలో సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజ్‌తో సమంత పంచుకున్న క్లోజ్ ఫొటోలు ఆ ప్రచారాలకు మరింత బలం చేకూర్చాయి. 'ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ' వంటి కీలక ప్రాజెక్టుల్లో రాజ్-డీకే సంయుక్త దర్శకత్వంలో సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాల పని సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. సమంత నిర్మించిన 'శుభం' చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆ సినిమా విజయోత్సవాల్లో వచ్చిన వీరిద్దరి ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెళ్లి పోటోలు వైరల్
Actress Samantha Got Married Today at Isha Yoga Centre through Bhuta Suddhi Vivah Process at Linga Bhairavi Devi Temple #SamanthaRuthPrabhu #SamanthaMarriage #Sadhguru #Ishafoundation #actress pic.twitter.com/dwq1O7z0ql
— This Is Last Time SG (@LastTimeSG) December 1, 2025