Page Loader
Samantha : త్వరలోనే సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి?.. ఇందులో నిజమెంత! 
త్వరలోనే సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి?.. ఇందులో నిజమెంత!

Samantha : త్వరలోనే సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి?.. ఇందులో నిజమెంత! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకోనుందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఎంతో కాలంగా సింగిల్‌గా ఉంటూ తన కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టిన సమంత.. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆమె హృదయాన్ని దోచుకున్న వ్యక్తి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు అని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట వ్యక్తిగతంగా కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఓఫోటోలో రాజ్ సమంత భుజంపై చేయి వేసి, ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటున్నట్లు కనిపించడంతో..ఇది కేవలం స్నేహం మాత్రమే కాదని నెటిజన్లు తేల్చేశారు.

Details

పెళ్లి తేదీని ఖరారు చేసినట్లు సమాచారం

అయితే అసలైన సంచలనం అప్పుడే మొదలైంది. అన్‌ఆఫిషియల్ సమాచారం ప్రకారం.. ఈ జంట ఇప్పటికే పెళ్లి తేదీని కూడా ఖరారు చేసిందట. మొదటగా ఈ పెళ్లి ఆగస్టులో జరుగుతుందని వార్తలు వచ్చినా, తాజా బజ్ ప్రకారం అక్టోబర్ 6న సమంత తన రెండో వివాహాన్ని జరుపుకోనున్నట్లు టాక్. ఈ డేట్‌ను చూసిన వారు షాక్‌కి గురవుతున్నారు. ఎందుకంటే ఇదే తేదీన గతంలో సమంత-నాగచైతన్యల పెళ్లి కూడా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం ఎలాంటి హంగామా లేకుండా, చర్చిలో సాదాసీదాగా ఈ వేడుకను జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఇరువురి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

Details

అధికారిక ప్రకటన రాలేదు

ఇంతటి చర్చ జరుగుతున్నా కూడా.. ఇప్పటివరకు సమంత గానీ, రాజ్ నిడిమోరా గానీ ఈ విషయంపై అధికారికంగా ఏమీ స్పష్టం చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు ఉధృతంగా వైరల్ అవుతున్నాయి. కెరీర్ పరంగా చూస్తే.. సమంత ప్రస్తుతం తన ప్రాజెక్టుల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇదంతా చూస్తుంటే, ఆమె జీవితం కొత్త దశలోకి ప్రవేశించబోతోందన్న అభిప్రాయం వెలువడుతోంది. ప్రేమ, పెళ్లి, కెరీర్ అన్నీ ఇప్పుడు సమంత నియంత్రణలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇక అక్టోబర్‌లో పెళ్లి నిజంగా జరుగుతుందా? లేక ఇదంతా మరొక పుకారేనా? అన్నది త్వరలోనే తేలనుంది.