LOADING...
Samantha: సమంత-రాజ్ భూతశుద్ధి వివాహం.. ఆ సంప్రదాయం వెనుక ఉన్న అర్థం ఇదే!
సమంత-రాజ్ భూతశుద్ధి వివాహం.. ఆ సంప్రదాయం వెనుక ఉన్న అర్థం ఇదే!

Samantha: సమంత-రాజ్ భూతశుద్ధి వివాహం.. ఆ సంప్రదాయం వెనుక ఉన్న అర్థం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమంత, రాజ్ నిడుమూరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారని ఈషా వ్యవస్థాపకులు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'భూతశుద్ధి వివాహం' అంటే ఏమిటనేది అందరిలోనూ ఆసక్తి రేపింది. ఈ వివాహం నిర్వహించిన ఈషా టీమ్‌ ప్రకారం—వధూవరుల దేహంలో ఉన్న పంచభూతాలను శుద్ధి చేసే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్రతువునే భూతశుద్ధి వివాహం అంటారు. ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే దాంపత్య జీవితంలో సామరస్యం, శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మికత పెరుగుతాయని విశ్వసిస్తారు. భూతశుద్ధి వివాహం అనేది పరంపరాగత హిందూ ధర్మంలోని ప్రత్యేక పద్ధతి. శరీరం, మనసు, పరిసరాల్లోని ప్రతికూల శక్తులను తొలగించడం, పూర్వజన్మ బంధాలు లేదా గ్రహదోషాలు తదితర అంశాల ప్రభావాన్ని తగ్గించడం ఈ ఆచారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.

Details

ఆలయంలో ప్రత్యేక పూజలు

లింగభైరవి ఆలయం లేదా ఈషా ఫౌండేషన్‌ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ వివాహం జరిగితే దంపతుల జీవితం మరింత శాంతియుతంగా సాగుతుందని నమ్మకం. లింగభైరవి ఆలయం స్త్రీశక్తికి చెందిన ఉగ్ర-కారుణ్య స్వరూపాల సమ్మేళనం అని సాధ్గురు జగ్గీ వాసుదేవ్‌ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. సమంత గత కొన్నేళ్లుగా లింగభైరవి ఉపాసన చేస్తుండటంతోనే తాను ఇష్టపడ్డ రాజ్‌ను అక్కడే అగ్నిహోత్రం సాక్షిగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహంలో మరో ప్రత్యేకత—అన్ని క్రతువులను ఒక మహిళా పూజారి నిర్వహించటం. ఇలా మరోసారి 'తెలుగింటి కోడలు' అయ్యింది సమంత. రాజ్‌ నిడుమూరు తిరుపతి జిల్లాకు చెందినవారు.

Details

'శుభం' చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన రాజ్

ఎస్‌వి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి, కొన్ని సంవత్సరాలు విదేశాల్లో పనిచేసిన ఆయన, తరువాత బాలీవుడ్‌కు వెళ్లి ప్రసిద్ధ దర్శకుడిగా ఎదిగారు. DKతో కలిసి 'రాజ్-DK'గా గుర్తింపు పొందినాడు. వీరి 'ది ఫ్యామిలీ మాన్' వెబ్‌సిరీస్ మూడు భాగాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఆ సిరీస్‌ రెండో పార్ట్‌లో నటించిన సమంత ఆ సమయంలోనే రాజ్‌తో బంధం బలపడింది. అనంతరం సిటాడెల్, హనీ బన్నీ ప్రాజెక్టుల సమయంలో కూడా వీరి సంబంధంపై వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత నిర్మిస్తున్న 'శుభం' చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అప్పుడే వీరి రిలేషన్‌పై ఉన్న అంచనాలు మరింత బలపడ్డాయి.

Advertisement

Details

కీలక పాత్రలో సమంత

ఇటీవల దీపావళిని కూడా సమంత, రాజ్ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. ఫంక్షన్లు, ఈవెంట్లలో ఇద్దరూ కలిసి కనిపించటం, సమంత కొత్తగా కొన్న ఇంటి గృహప్రవేశంలో రాజ్ సైతం పాల్గొనడంతో అభిమానుల్లో సందేహం నెలకొంది. ప్రస్తుతం రాజ్ 'రక్త బ్రహ్మాండ' వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నాడు. ఇందులో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది.

Advertisement