Samantha- Raj Nidimoru: నేడు సమంత-రాజ్ వివాహం?.. కోయంబత్తురులో జరగనున్నట్లు టాక్!
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు రాజ్ డీ.కె, నటి సమంత, రూత్ ప్రభు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద హంగామా సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 1న తమిళనాడులో వీరి వివాహం జరగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి దే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతూ కొత్త చర్చకు దారితీసింది. రాజ్ &డీ.కె ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరు, సమంత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని గతంనుంచిపుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జంట డిసెంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారని కొత్తగా వచ్చిన రూమర్లు మరింత వేగంగా పాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్ మాజీ భార్య శ్యామాలి దే షేర్ చేసిన స్టోరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
Details
సమంత రెండో పెళ్లి పుకార్లు
రాజ్ నిడిమోరుతో సమంత రెండో వివాహం చేసుకోబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా నడుస్తోంది. సోమవారం ఈ పెళ్లి జరగవచ్చు అని కూడా పుకార్లు వచ్చాయి. ఈ తరుణంలోనే శ్యామాలి దే ఆదివారం తన ఇన్‌స్టా స్టోరీలో మైఖేల్ బ్రూక్స్ కోట్‌ను షేర్ చేస్తూ నిస్సహాయ వ్యక్తులు నిస్సహాయ పనులు చేస్తారని రాసింది. ఈ పోస్ట్‌ను రెడ్డిట్‌లో షేర్ చేసిన నెటిజన్లు దీన్ని సమంత-రాజ్ వివాహ రూమర్లతో లింక్ చేసి చర్చిస్తున్నారు.
Details
పెళ్లి నిజమేనా?
ఫిల్మీబీట్ కథనం ప్రకారం సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటవుతారన్న సమాచారం వస్తోంది. 'సిటాడెల్' షూటింగ్ సమయంలో దగ్గరైన ఈ జంట కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో సన్నిహితుల మధ్య వివాహం ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం రెడ్డిట్‌లో మరింత వైరల్ అవుతోంది. అయితే దీనిపై రాజ్, సమంత లేదా వారి టీమ్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Details
నెటిజన్ల రియాక్షన్స్
సమంత-రాజ్ వివాహ రూమర్లు, శ్యామాలి దే స్టోరీ ఇద్దరినీ కలిపి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెకు సానుభూతి తెలియజేస్తూ "పాపం ఆమె... మనకు అవసరమైనప్పుడు తోడుగా ఉన్నవారే నిజంగా మనవాళ్లు అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు శ్యామాలి దేను ముందుకు సాగాలని సూచిస్తూ ఆమె గతాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కామెంట్ చేశారు. ఇంకొందరు రాజ్ ఇప్పటికే విడాకులు తీసుకున్న తర్వాతే సమంతతో సంబంధం మొదలైందని చెబుతుండగా... కొంతమంది మాత్రం సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హృదయ విదారకమైన విడాకులు తర్వాత మరో మహిళ జీవితంలో ఇలా జోక్యం చేసుకోవడం సరికాదని విమర్శించారు.