Samantha Ruth Prabhu: సమంతకు ఘనంగా బేబీ షవర్ ... వీడియో షేర్ చేసిన రాజ్ సిస్టర్
ఈ వార్తాకథనం ఏంటి
నటి సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఆమె కుటుంబంలో సందడి మొదలైంది. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సమంత సంప్రదాయ పద్ధతిలో బేబీ షవర్ వేడుకను జరుపుకున్నారు. సీమంతం పేరుతో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. ఎరుపు రంగు దుస్తుల్లో సమంత కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రాజ్ సోదరి శీతల్ నిడిమోరు షేర్ చేసిన వీడియో ఈ వేడుకలోని ప్రత్యేక క్షణాలను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.
Details
కుటుంబ సంప్రదాయాలతో ప్రత్యేకంగా వేడుక
శీతల్ నిడిమోరు తన పోస్ట్‌లో ఈ వేడుక తమ కుటుంబానికి ఎంత ప్రత్యేకమో వివరించారు.
చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పూజా మందిరం వద్ద ప్రార్థనలు, భజనలు చేయడం తమకు అలవాటని ఆమె గుర్తు చేసుకున్నారు.
సమంత కోసం జరిగిన సీమంతంలో కూడా అదే కుటుంబ సంప్రదాయం కనిపించిందని చెప్పారు.
శ్రీ సూక్తం, గాయత్రీ దేవి హోమం నిర్వహించడంతో పాటు గాయత్రీ మంత్రాన్ని 21 సార్లు జపించారు.
సమంత, కాబోయే బిడ్డ కోసం కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా రూపొందించిన పాటను కూడా పాడారు.
Details
'లిటిల్ వన్.. ఇంత ప్రేమను చూడు' అంటూ
వేడుక ముగింపులో శీతల్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
కుటుంబమంతా ఒక్కచోట చేరడానికి కారణమైన సమంత, కాబోయే బిడ్డపై ఆమె ప్రేమను వ్యక్తం చేశారు.
పుట్టకముందే ఆ చిన్నారి అందరినీ ఒక్కచోట చేర్చిందంటూ ఆమె పేర్కొన్నారు. సమంతకు సుఖ ప్రసవం, తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం ఆశీర్వాదాలు కోరారు.
2026 డిసెంబర్‌లో బిడ్డ రానున్నట్లు సమాచారం. అంతకుముందు సెప్టెంబర్‌లో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో కూడా సమంత మరో ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు.
2025 డిసెంబర్‌లో ఇదే ప్రదేశంలోని లింగ భైరవి ఆలయంలో సమంత, రాజ్ వివాహం జరిగింది.