LOADING...
Samantha : సమంత బర్త్‌డే స్పెషల్.. 'మా ఇంటి బంగారం'తో హిట్ ట్రాక్‌లోకి వస్తుందా?
సమంత బర్త్‌డే స్పెషల్.. 'మా ఇంటి బంగారం'తో హిట్ ట్రాక్‌లోకి వస్తుందా?

Samantha : సమంత బర్త్‌డే స్పెషల్.. 'మా ఇంటి బంగారం'తో హిట్ ట్రాక్‌లోకి వస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

నేడు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత మరోసారి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత, తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో కలిసి నటించి ఎన్నో విజయాలను అందుకుంది. అయితే అది గతం మాత్రమే అన్నట్టుగా, ప్రస్తుతం ఆమెకు థియేటర్లలో పెద్ద హిట్ లేక చాలా కాలం అయింది. వ్యక్తిగతంగా విడాకులు, ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ఆ తర్వాత వ్యాపారాలతో బిజీగా మారి సినిమాలకు విరామం ఇస్తూ వచ్చింది.

వివరాలు

సమంత నటనకు ప్రశంసలు

చివరిసారిగా 2019లో 'సూపర్ డీలక్స్', 'మజిలీ', 'బేబీ' సినిమాలతో వరుస విజయాలు అందుకుంది.కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ అనే మాట వినిపించలేదు. 2019చివర్లో అక్కినేని నాగార్జున నటించిన 'మన్మధుడు 2'లో గెస్ట్ రోల్ చేసింది, అయితే ఆ చిత్రం నిరాశపరిచింది. 2020లో తమిళ చిత్రం '96'కు రీమేక్‌గా వచ్చిన 'జాను'లో ఆమె నటనకు ప్రశంసలు లభించినా, వాణిజ్యపరంగా ఫలితం దక్కలేదు. తర్వాత నయనతారతో కలిసి 'కాతువాకుల రెండూ కాదల్'లో నటించగా, అది సగటు విజయాన్నే సాధించింది. అనంతరం హాలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'యశోద'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'శకుంతలం' డిజాస్టర్‌గా నిలిచింది.

వివరాలు

తన

అలాగే విజయ్ దేవరకొండతో చేసిన 'ఖుషి' కూడా ఫ్లాప్‌గా మారింది. ఇలా దాదాపు ఆరేళ్లుగా సమంత ప్రధాన పాత్రలో చేసిన సినిమాలు కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఇంతలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్'లో ప్రత్యేక గీతంతో ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో 'సిటిడాల్' సిరీస్‌లో నటించినా, అది తెలుగు, తమిళ ప్రేక్షకులతో పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లో కీలక పాత్రతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత రీ-ఎంట్రీలో నిర్మాతగా 'శుభం' అనే చిత్రంతో ముందుకొచ్చింది. ఆ సినిమా వాణిజ్యపరంగా ఓకే అనిపించినా, అందులో ఆమె చేసిన గెస్ట్ పాత్రకు విమర్శలు వచ్చాయి.

Advertisement

వివరాలు

మే15న  రిలీజ్

ప్రస్తుతం సమంత తనకు సన్నిహితురాలు, దర్శకురాలు నందినిరెడ్డితో కలిసి 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. మే 15న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతోంది. అయితే విడుదలకు ఇంకా రెండు వారాలే ఉన్నప్పటికీ, చిత్రానికి తగినంత హైప్ రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. సమంత స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బలంగా ప్రమోట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

వివరాలు

రాజ్ నిడిమోరుతో రెండో వివాహం

ఇదిలా ఉంటే, సమంత ఇటీవల రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎక్కువగా వ్యాపారాలపైనే దృష్టి సారిస్తోంది. ఇకపై సమంత కమర్షియల్ సినిమాలు చేస్తుందా? మళ్లీ హీరోల సరసన హీరోయిన్‌గా కనిపిస్తుందా? లేక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమవుతుందా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'మా ఇంటి బంగారం' చిత్రం హిట్ అయి సమంత మార్కెట్ మళ్లీ పెరగాలని, ఆమె వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పెళ్లి తర్వాత విడుదల కానున్న తొలి చిత్రం కావడంతో, ఈ సినిమా సమంత కెరీర్‌కు ఎలా మలుపుతిప్పుతుందో చూడాల్సి ఉంది.

Advertisement