SubhamTrailer : సమంత నిర్మాతగా తొలి సినిమా 'శుభం' ట్రైలర్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటనతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది.
సామ్ నిర్మాతగా ప్రవేశించిన తొలి సినిమా 'శుభం'. ఈ చిత్రంలో సి. మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు.
'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ను టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
Details
మే 9న మూవీ రిలీజ్
కథలో ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు టీవీ సీరియళ్ల పిచ్చితో, రోజూ రాత్రి 9 గంటలకు సీరియల్ పాత్రలని తమకు ఎదురవుతున్నట్టు భావించే సరికొత్త కాన్సెప్ట్ ట్రైలర్‌లో కనిపించింది.
చివర్లో సమంత ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సామ్ దయ్యాలను వదిలించే మంత్రిగత్తె గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్‌గా ఎన్నో విజయాలు అందుకున్న సమంత నిర్మాతగా కూడా ఎలా సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.
హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన 'శుభం' ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.