LOADING...
Samantha: సమంత కొత్త ఇంటి గృహప్రవేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు!
సమంత కొత్త ఇంటి గృహప్రవేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Samantha: సమంత కొత్త ఇంటి గృహప్రవేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆమె తరచూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు. తాజాగా, సమంత తన జీవితంలో కొత్త అడుగు వేసారు. కొత్త ఇంటి గృహప్రవేశం. ఈ సందర్భంగా ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో పూజలు నిర్వహిస్తూ, ఆ పూజ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోల్లో దేవాలయ వాతావరణం, పూజ సమయంలో సమంత శాంతమైన ముఖం అందరినీ ఆకట్టుకుంది. ఆమె ముఖానికి కుంకుమ వేసి పూజలో సంప్రదాయబద్ధంగా పాల్గొనడం హైలైట్‌గా మారింది.

Details

'మా ఇంటి బంగారం'లో కనిపించనున్న సమంత

తాను ఆలోచించేది, చెప్పేది, చేసేది, లక్ష్యంగా పెట్టుకునే ప్రతిదీ నా అత్యున్నత స్వభావాన్ని గౌరవించాలి. నేను అదే నేర్చుకున్నాను. ఇప్పుడు అది చేయగలనని ఆశిస్తున్నానని సమంత పోస్టు చేశారు. ఇక మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత, సమంత వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. నిర్మాతగా 'శుభం' సినిమాను నిర్మించారు. ఈ లేడి ఓరియెంటెడ్‌గా 'మా ఇంటి బంగారం'లో త్వరలో కనిపించనున్నారు.