Page Loader
ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సమంత పోస్టు: ఆరు నెలలు కష్టపడాల్సిందే అంటున్న బేబీ హీరోయిన్ 
ఆరునెలలు కష్టంగా గడపాల్సిందే అంటున్న సమంత

ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సమంత పోస్టు: ఆరు నెలలు కష్టపడాల్సిందే అంటున్న బేబీ హీరోయిన్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 10, 2023
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోయిన్ సమంత, సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత, ట్రీట్మెంట్ కోసం సంవత్సరం పాటు షూటింగులకు బ్రేక్ చెప్పిందని అన్నారు. తాజాగా సమంత పెట్టిన పోస్టు, ఈ విషయంపై మరింత క్లారిటీ ఇస్తున్నాయి. తన జీవితంలో గడపబోయే ఈ ఆరు నెలలు చాలా కష్టంతో కూడుకుని ఉంటాయని సమంత చెబుతోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు సమంత అలా ఎందుకు పెట్టిందని ఆరా తీస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సమంత తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అమెరికా వెళ్ళనుందట. అక్కడే ఆరునెలలు ట్రీట్ మెంట్ జరుగుతుందని అంటున్నారు.

Details

మయోసైటిస్ నుండి రికవరీ కోసం అమెరికాకు సమంత 

మరో విషయం ఏంటంటే, సమంతకు మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదట. అందుకోసమే అమెరికా వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుని మయోసైటిస్ ని పూర్తిగా ఓడించి తిరిగి రావాలని సమంత అనుకుంటుందని చెప్తున్నారు. మరి సమంత, అమెరికా ఎప్పుడు వెళ్తుందనేది తెలియదు. అదలా ఉంచితే, సమంత ప్రస్తుతం ఖుషి సినిమాలో, సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది. వీటిల్లో విజయ్ దేవరకొండ హీరోగా కనిపిస్తున్న ఖుషి సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక సిటాడెల్ విషయానికి వస్తే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరికొద్ది రోజుల్లో ప్రసారం కానుంది. వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న ఈ సిరీస్ ను ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు.