Samantha: సమంత పెళ్లి ఉంగరం వైరల్.. మొగల్ కాలం నుంచి వచ్చిన వారసత్వ రింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
నటి సమంత-రాజ్‌ల వివాహం ఇటీవలే జరగగా, ఈ వేడుకలో ఇద్దరి కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సమంత (Samantha) చేతిని అలంకరించిన డైమండ్ రింగ్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఈ ప్రత్యేక ఉంగరం ధరించిన ఫొటోలు షేర్ చేసినప్పటికీ, పెళ్లిలో ఆ రింగ్ మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. ప్రతి అంశంలోనూ వైవిధ్యాన్ని కోరుకునే సమంత, తన వెడ్డింగ్ రింగ్ ఎంపికలో కూడా అదే ప్రత్యేకతను ప్రతిబింబించారు. వీరి కాస్ట్యూమ్స్ వివరాలపై జంట అధికారికంగా ఏమీ చెప్పకపోయినా, ప్రముఖ జ్యువెలరీ వ్యాపారి అభిలాషా భండారి ఈ ఉంగరంపై కీలక వివరాలు వెల్లడించారు.
Details
ఈ రింగ్స్ చాలా అరుదుగా తయారు చేస్తారు
ఆమె తెలిపిన ప్రకారం, సమంత ధరించినది పోట్రెయిట్ కట్ డైమండ్ రింగ్. మొగల్ కాలంలో ఈ శైలికి విశేష ప్రాధాన్యం ఉండేదని తెలిపారు. 'పోట్రెయిట్ కట్‌ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఇది మొదట మొగళ్లు రూపొందించిన ప్రత్యేక శైలి. వజ్రాన్ని ప్రత్యేక రీతిలో కట్ చేసి, పలుచని గాజు పలకలా తయారు చేస్తారు. ఈ విధమైన రింగ్స్ చాలా అరుదుగా తయారవుతాయని భండారి వివరించారు. ఈ కట్ శతాబ్దాల వారసత్వాన్ని కలిగి ఉందని, తాజ్ మహల్ నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం కూడా ఈ తరహా ఉంగరాలను ఎంతో ఇష్టపడేవారని చరిత్రకారుల అభిప్రాయాన్ని గుర్తుచేశారు.
Details
ఆ రింగ్ తో ప్రత్యేక ఆకర్షణ
పూర్వంలో బాలీవుడ్ తారలు ధరించిన డైమండ్ రింగ్స్‌తో పోలిస్తే అలియా భట్ వేసుకున్న ఓవల్ షేప్ రింగ్, ప్రియాంక చోప్రా ఎంపిక చేసిన క్లాసిక్ కుషన్ కట్, కత్రినా కైఫ్ ధరించిన రాజరిక శైలినీళం రింగ్ ఇవన్నింటికంటే సమంత ఎంపిక పూర్తిగా భిన్నమని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక వివాహ వేడుకలో ఎర్ర చీరలో మెరిసిన సమంత, సంప్రదాయ నగలతో ఆకట్టుకున్నారు. చోకర్ నెక్లెస్, భారీ చెవిపోగులు ఆమె లుక్‌కు మరింత ఆకర్షణను చేకూర్చాయి.