
ఫోటో షేర్ చేసి మరీ మజిలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత
ఈ వార్తాకథనం ఏంటి
నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందిన మజిలీ చిత్రం రిలీజై నిన్నటితో 4సంవత్సరాలు పూర్తయ్యింది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోకముందు కలిసి నటించిన చిత్రమిది.
ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానులకు బాగా నచ్చేసింది. అందుకే మజిలీ సినిమాను హిట్ చేసారు.
అయితే మజిలీ చిత్రం రిలీజై నాలుగేళ్ళు అవుతున్న సందర్భంగా అప్పటి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకుంది సమంత. షూటింగ్ టైమ్ లో దర్శకుడు శివ నిర్వాణతో మాట్లడుతున్న తన ఫోటోలను పంచుకున్న సమంత, శ్రావణి పాత్రను తనకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది.
అంతేకాదు, అప్పుడు శ్రావణి పాత్ర ఎంత బాగా వచ్చిందో, ఇప్పుడు ఖుషి సినిమాలో చేస్తున్న ఆరాధ్య పాత్ర కూడా అంత బాగుంటుందని అంది.
సమంత
మజిలీ చిత్రంలోని ఎంట్రన్స్ సీన్ ని షేర్ చేసిన సమంత
తన సోషల్ అకౌంట్ లో స్టేటస్ గా పెటుకున్న ఈ ఫోటో, ఇప్పుడు వైరల్ గా మారింది. మజిలీ చిత్రంలో తన ఎంట్రన్స్ సీన్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.
నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. 4సంవత్సరాల భాగస్వామ్యం తర్వాత 2021లో విడాకులు తీసుకుని తమ తమ దారుల్లో వెళ్ళిపోయారు.
విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధిన బారిన పడింది సమంత. దాంతో కొన్ని రోజులు షూటింగులకు గ్యాప్ ఇచ్చి తాజాగా మళ్ళీ షూటింగుల్లో పాల్గొంటుంది.
ప్రస్తుతం శాకుంతలం సినిమాను ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 14వ తేదీన తీసుకువస్తుంది. సమంత కెరీర్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న మొదటి చిత్రం ఇదే.