NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ని షేర్ చేస్తూ 36ఏళ్ల వయసులో అన్నీ చూసానంటున్న సమంత 
    తదుపరి వార్తా కథనం
    రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ని షేర్ చేస్తూ 36ఏళ్ల వయసులో అన్నీ చూసానంటున్న సమంత 
    జీవితంలో అన్నీ చూసానంటూ పోస్ట్ పెట్టిన సమంత

    రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ని షేర్ చేస్తూ 36ఏళ్ల వయసులో అన్నీ చూసానంటున్న సమంత 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 28, 2023
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు సమంత పుట్టినరోజు. 37వ వడిలోకి అడుగుపెడుతోంది సమంత. ఈ నేపథ్యంలో సినిమా సెలెబ్రిటీలు, అభిమానులు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    అయితే తాజాగా సమంత పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో వివిధ దశల్లోని ఫోటోలను ఏకకాలంలో పంచుకున్న సమంత, జీవితంలో అన్నీ చూసానని పేర్కొంది.

    16ఏళ్ల ప్రాయంలోని తన ఫోటో నుండి మొదలు పెట్టి తను పెంచుకునే కుక్కపిల్లల ఫోటోలను, అప్పట్లో మాడలింగ్ చేసినప్పటి ఫోటోను పంచుకుంది.

    అలాగే, అనారోగ్యం కారణంగా ఆక్సిజన్ మాస్క్ తగిలించుకున్న ఫోటో, హైపర్ బేరిక్ థెరపీ గురించిన ఫోటో, గుర్రపు స్వారీ చేస్తున్నప్పటి ఫోటోను షేర్ చేసింది.

    Details

    రవీంద్ర నాథ్ ఠాగూర్ కొటేషన్ 

    చివరగా రవీంద్ర నాథ్ ఠాగూర్ కొటేషన్ ఫోటోను షేర్ చేసింది.

    ఒకతను మొక్కలు పెంచుకుంటూ వెళ్తున్నాడు. అవి పెరిగి పెద్దయ్యి నీడను ఇచ్చినపుడు, ఆ నీడలో తలదాచుకోలేని తనకు తెలిసినా కూడా మొక్కలు నాటుతూ వెళ్తున్నాడు. అలా నాటడంలో జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటున్నాడని కొటేషన్ లో ఉంది.

    ఈ ఫోటోలు, ఈ కొటేషన్ షేర్ చేయడానికి కారణమేంటనేది మాత్రం ఆమె వెల్లడి చేయలేదు. బర్త్ డేకి ఒకరోజు ముందు పోస్ట్ చేసింది కాబట్టి పుట్టినరోజు సందర్భంగానే షేర్ చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు.

    సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్, ఖుషి సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన శాకుంతలం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత పంచుకున్న కొన్ని ఫోటోలు

    Instagram post

    A post shared by samantharuthprabhuoffl on April 28, 2023 at 1:21 pm IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సమంత

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలుగు సినిమా

    అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార  మహేష్ బాబు
    డబల్ ఇస్మార్ట్: పూరీ జగన్నాథ్ కు హిట్ పడాలంటే రామ్ కావాల్సిందేనా?  సినిమా
    ఉగ్రం ట్రైలర్: మిస్సింగ్ కేసులను ఛేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్  ట్రైలర్ టాక్
    ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా?  రవితేజ

    సమంత

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు ఓటిటి
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  తెలుగు సినిమా
    సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025