సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు
ఈ వార్తాకథనం ఏంటి
సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు హాజరైన సమంత ట్రోలర్స్ చేతికి చిక్కింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటిస్తున్న సమంతను అక్కడి మీడియా ప్రశ్నలు వేసింది.
ఈ నేపథ్యంలో సమంత మాట్లాడుతూ, సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందని సమంత తెలియజేసింది.
కానీ ఆమె మాటతీరు ఇప్పుడు ట్రోల్స్ కు గురైంది. దానిక్కారణం ఆమె ఇంగ్లీష్ యాస. సాధారణంగా ఎప్పుడూ మాట్లాడినట్టుగా కాకుండా, పశ్చిమ దేశాల ప్రజలు మాట్లాడే యాసలో మాట్లాడింది సమంత.
దాంతో నెటిజనుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఫేక్ యాక్సెంట్ అంటూ సమంతను ట్రోల్ చేస్తున్నారు. వేరే దేశాలకు వెళ్ళినపుడు ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు మాట్లాడతారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Details
గతంలో అమెరికన్ యాసలో మాట్లాడిన ఎన్టీఆర్, రామ్ చరణ్
ప్రస్తుతం సమంత ఇంగ్లీష్ యాస మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆమె మాట్లాడిన యాస అస్సలు బాలేదనీ, భారతీయ యాసలో మాట్లాడితే ఏమైనా అవుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గతంలో ఆస్కార్ అవార్డుల సందర్భంగా అమెరికా వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా అమెరికన్ యాసలో మాట్లాడారు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.
సిటాడెల్ సిరీస్ లో ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన సిటాడెల్ నుండి రెండు ఎపిసోడ్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత ప్రతీ శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సిటాడెల్ లండన్ ప్రీమియర్ లో సమంత
Warra Fake Accent 🤡🤡🤡 pic.twitter.com/WGJmElk2WC
— 🐋 (@Bhaag_Saale) April 23, 2023