Page Loader
సమంత ఖాతాలో మరో మూవీ, ఈ సారి దళపతి విజయ్ సరసన?
విజయ్ సరసన నాలుగోసారి సమంత నటిస్తుందంటూ వార్తలు

సమంత ఖాతాలో మరో మూవీ, ఈ సారి దళపతి విజయ్ సరసన?

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 04, 2023
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత, గతకొన్ని రోజుల నుండి సినిమాల్లో యాక్టివ్ గా ఉంది. శాకుంతలం ప్రమోషన్లలో కనిపిస్తున్న సమంత, వరుసగా సినిమాలను మొదలెడుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా మొదలైంది. అటు సిటాడెల్ సిరీస్ లోనూ కనిపిస్తుంది. ఇప్పుడు శాకుంతలం రిలీజ్ కు రెడీగా ఉంది. ఇవన్నీ గాక సమంతకు మరో మూవీలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. తమిళ హీరో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా సమంత నటించనుందని అంటున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో మూవీని చేస్తున్నాడు విజయ్. ఇందులో త్రిష్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు విజయ్.

సమంత

కత్తి, మెర్సల్, తెరి చిత్రాల్లో విజయ్ సరసన మెరిసిన సమంత

అట్లీ రూపొందించే సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఒకవేళ సమంత కన్ఫామ్ అయితే విజయ్ తో ఇది నాలుగవ సినిమా అవుతుంది. ఇదివరకు కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో విజయ్ సరసన మెరిసింది సమంత. మరి ఈ విషయమై ఎప్పుడు సమాచారం వస్తుందో చూడాలి. ప్రస్తుతం షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. అది పూర్తయ్యాక విజయ్ తో తెరకెక్కించే సినిమా మీద వర్క్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. అదలా ఉంచితే, సమంత నటిస్తున్న శాకుంతలం, పాన్ ఇండియా రేంజ్ లో ఏప్రిల్ 14వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో విడుదల అవుతుంది.