మళ్ళీ ప్రేమలో పడొచ్చుగా అంటూ సమంతకు సలహా ఇచ్చిన నెటిజన్, సమంత రిప్లై చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
హీరోయిన్లలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సమంత వ్యక్తిగత జీవితం అంత సాఫీగా లేదు. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత అనారోగ్యంతో పోరాటం.. మొదలగు కారణాల వల్ల తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది సమంత. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది సమంత. అనారోగ్యం నుండి కొంత కోలుకుని సినిమాలను కూడా మొదలెట్టింది. తాజాగా శాకుంతలం ప్రమోషన్లలో పాల్గొంటున్న సమంత, ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఇలా చెప్పవచ్చో లేదో తెలియదని అంటూనే, మీరు మళ్ళీ ప్రేమలో పడొచ్చు కదా, రిలేషన్ లో ఉండొచ్చు కదా అని సమంతను అడిగింది ఒక నెటిజన్.
మీకంటే బాగా ఎవరు ప్రేమించగలరన్న సమంత
నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మీకంటే నన్ను బాగా ఎవరు ప్రేమించగలరు అని రిప్లై ఇచ్చింది సమంత. ప్రస్తుతం, ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సమంత సమాధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. సమంత మళ్ళీ కుదుటపడాలనీ, సాఫీగా జీవితాన్ని సాగించాలనీ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇదివరకు కూడా చాలామంది అభిమానులు, మయోసైటిస్ నుండి సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా సాక్షిగా ప్రార్థనలు చేసారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా, ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతోంది. సమంత కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన శాకుతలం చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేసారు.