Loading...
Sampath Nandi: పవన్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా...సంపత్‌ నంది క్లారిటీ
పవన్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా...సంపత్‌ నంది క్లారిటీ

Sampath Nandi: పవన్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా...సంపత్‌ నంది క్లారిటీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 26, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా.. ఆ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వస్తే అందుకు కారణం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు తాజాగా దర్శకుడు సంపత్ నంది సమాధానమిచ్చారు. పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి తొలుత తానే దర్శకుడిగా ఎంపికయ్యానని, అయితే షూటింగ్ ప్రారంభం ఆలస్యం కావడంతో పరస్పర అంగీకారంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నానని వెల్లడించారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

Details

పవన్ స్వయంగా పిలిచి మాట్లాడారు

సంపత్ నంది దర్శకత్వంలోనే 'సర్దార్ గబ్బర్ సింగ్' మొదలుకావాల్సి ఉంది.

అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్‌ ఇతర సినిమాలు, వ్యక్తిగత కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడానికి సమయం పట్టింది.

ఈ పరిస్థితిని గమనించిన పవన్ స్వయంగా సంపత్ నందిని పిలిచి మాట్లాడారట.

సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉందని, అప్పటివరకు వేచి ఉండగలరా అని అడిగినట్లు దర్శకుడు గుర్తుచేసుకున్నారు.

Details

మరో సినిమా చేసుకుంటానని చెప్పా

దీనికి సంపత్ నంది కూడా చాలా స్పష్టంగా స్పందించారట. ఈలోపు తాను మరో సినిమా పూర్తి చేసుకుంటే పవన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని అడిగినట్లు తెలిపారు.

ఇద్దరి మధ్య జరిగిన ఈ చర్చతోనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండానే ఈ వ్యవహారం సాఫీగా ముగిసిందని వివరించారు.

ఒక సినిమా కోసం మరొకరిని ఎక్కువ కాలం ఎదురుచూసేలా చేయడం పవన్‌కు ఇష్టం ఉండదని కూడా సంపత్ నంది పేర్కొన్నారు.

ADVERTISEMENT

Details

చివరి వరకు ప్రయత్నించిన పవన్

తనతో సినిమా చేయాలని పవన్ కల్యాణ్ చివరి వరకు ప్రయత్నించారని సంపత్ నంది గుర్తుచేసుకున్నారు.

తాజా చిత్రం 'భోగి' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

చివరకు 'సర్దార్ గబ్బర్ సింగ్' బాధ్యతలను దర్శకుడు బాబీ చేపట్టి సినిమాను పూర్తి చేశారు.

ఈ సినిమా నుంచి తాను తప్పుకోవడానికి అసలు కారణం షూటింగ్ ఆలస్యమేనని సంపత్ నంది చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో జరిగిన పరిణామాలపై స్పష్టత వచ్చింది.

ADVERTISEMENT