మార్టిన్ లూథర్ కింగ్ టీజర్: నవ్వులు పూయిస్తున్న సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. నరేష్, వెంకటేష్ మహా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పుడే రిలీజైంది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ టీజర్ మొత్తం, నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉంది. ఒకానొక ఊరిలో అనుక్షణం కొట్టుకునే రెండు గ్రూపులు, ఒక్క ఓటు కోసం ఏం చేసాయన్నదే కథ అని సినిమా అర్థమవుతుంది. ఆ ఒక్క ఓటే ఊరి ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడానికి కీలకం కావడమే కథలోని అసలు ట్విస్టు. టీజర్ మొత్తం హాయిగా సాగిపోయింది. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.