Akhanda 2: బాలయ్య సరసన గోల్డెన్ లెగ్ బ్యూటీ .. అఖండ 2 నుంచి పోస్టర్ రివీల్
ఈ వార్తాకథనం ఏంటి
డాకు మహరాజ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "ఆఖండ 2" సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో తనకు ఎంతో అచ్చొచ్చిన దర్శకుడు, బోయపాటి శ్రీనుతో మళ్లీ చేతులు కలిపాడు బాలయ్య.
ఈ కాంబోలో వస్తున్న తాజా చిత్రం "ఆఖండ 2 - తాండవం". ఇది అఖండ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
ఇప్పటికే మహాకుంభమేళా, ఏపీ పరిసరాలలో షూటింగ్ ప్రారంభించబడిన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.
వివరాలు
హీరోయిన్‌గా మలయాళ భామ సంయుక్త
ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ఈ సినిమాలో హీరోయిన్‌ను పరిచయం చేసింది.
మలయాళ భామ సంయుక్త ఈ చిత్రంలో నటించబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా సంయుక్త పోస్టర్‌ను కూడా పంచుకుంది. ఈ చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్నారు.
బాలయ్య కూతురు తేజస్విని కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
"ఆఖండ" తర్వాత ఈ సినిమా వస్తున్నందున, ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
The talented and happening @iamsamyuktha_ is on board for #Akhanda2 - Thaandavam ✨
— 14 Reels Plus (@14ReelsPlus) January 24, 2025
Shoot in full swing 💥
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus @RaamAchanta… pic.twitter.com/Snr685kUl7