
తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు విరూపాక్ష సినిమా నుండి సంయుక్తా మీనన్ పోస్టర్ రిలీజ్ కాలేదు.
ఇదివరకు రిలీజైన టీజర్ లోనూ ఆమె కనిపించలేదు. ఉగాది రోజున ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తామని విరూపాక్ష టీమ్ చెప్పిందట. కానీ రిలీజ్ కాకపోవడంతో ట్విట్టర్ వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ ఎస్వీసీసీని ప్రశ్నించింది సంయుక్తా.
పోస్టర్ రిలీజ్ కాకపోవడం బాధగా అనిపించిందనీ, ఉగాది రోజున పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎందుకు రిలీజ్ చేయలేదనీ, ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారని అడిగింది సంయుక్తా.
ఇలా అడిగే ముందు, విరూపాక్షలో తన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందనీ, అందరూ బాగా సహకరించారని ఆమె చెప్పుకొచ్చింది.
విరూపాక్ష
క్షమించమంటూ పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ
సంయుక్తా పెట్టిన పోస్టుకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ స్పందిస్తూ, పోస్టర్ రిలీజ్ చేయడం కుదరలేదనీ, ఇలా చేసినందుకు క్షమించాలని, మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తామని పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఎవ్వరూ కూడా ఇలా అడిగిన వాళ్ళు లేరనీ, సంయుక్తా ధైర్యానికి శభాష్ అని కామెంట్లు చేస్తున్నారు.
మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన విరూపాక్ష సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ కి సిద్ధం అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోస్టర్ రిలీజ్ చేయకపోవడంతో నిర్మాతలను ప్రశ్నించిన సంయుక్తా మీనన్
Before I express my disappointment,
— Samyuktha (@iamsamyuktha_) March 22, 2023
My journey with #Virupaksha is something I have cherished always and humbled at the opportunity to work with such amazing actors and technicians .@SVCCofficial why so irresponsible🤨 I was promised that my character poster will be released on…