Page Loader
OG: ఓజితో పవన్ ఫ్యాన్స్ కి పండగే అంటున్న సుజిత్
OG: ఓజితో పవన్ ఫ్యాన్స్ కి పండగే అంటున్న సుజిత్

OG: ఓజితో పవన్ ఫ్యాన్స్ కి పండగే అంటున్న సుజిత్

వ్రాసిన వారు Stalin
May 27, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" మూవీతో వెండి తెరపై సరికొత్తగా కనిపించనున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యం,గ్యాంగ్ స్టర్ గా కలగలిసి ఈ పొలిటకల్ స్టార్ దుమ్ములేపనున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి మూవీలో మార్షల్ ఆర్ట్స్ సీన్లు చాలా చేశారు. అవి అప్పట్లో ఆయన ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న OGలో సైతం ఇవే యాక్షన్ సీన్లు ఉంటాయని టాలీవుడ్ లో టాక్. ఇదే విషయాన్ని దర్శకుడు సుజిత్ కన్ ఫర్మ్ చేశారు.

Details 

మార్షల్ ఆర్ట్స్ సీన్ల కోసం జపనీస్ సినిమాలు

ఈ మాస్ గ్యాంగ్ స్టర్, యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ సీన్లు బాగా రావటానికి తాను జపనీస్ సినిమాలు చూశానన్నారు. తన కృషి వెండి తెరపై చూడండని ఆయన ఫ్యాన్స్ కి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పాల్గొనటం వల్ల ఎప్పుడో విడుదల కావాల్సిన OG సెప్టెంబర్ ఆఖరులో రానుంది.