Page Loader
Spirit: రెబెల్ స్టార్ ప్రభాస్ తో నటించాలను ఉందా.. ఐతే ఈ అవకాశం మీ కోసమే..
రెబెల్ స్టార్ ప్రభాస్ తో నటించాలను ఉందా.. ఐతే ఈ అవకాశం మీ కోసమే..

Spirit: రెబెల్ స్టార్ ప్రభాస్ తో నటించాలను ఉందా.. ఐతే ఈ అవకాశం మీ కోసమే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాల్లో నటించడం అనేది చాలా మంది కల, అయితే కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. తాజాగా, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ హీరోగా నటిస్తున్న "స్పిరిట్" సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం "స్పిరిట్" అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. గతంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఇదే బ్యానర్ నిర్మించగా, ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో ఈ బ్యానర్ సహనిర్మాతగా కొనసాగింది.

వివరాలు 

అన్ని వయసుల వారికి అవకాశం 

ఇప్పుడు, భద్రకాళి పిక్చర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. "స్పిరిట్" సినిమాలో నటించేందుకు అన్ని వయసుల వారికి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అయితే, ఈ అవకాశాన్ని పొందేందుకు సినీ రంగం లేదా థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే అర్హులు అని స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, అభ్యర్థులు తాము తీసుకున్న ఒక హెడ్‌షాట్ ఫోటోతో పాటు వ్యక్తిగత ఫోటోని కూడా జతచేయాలని సూచించారు. అంతేకాక, తమ పేరు, ఇతర ప్రాథమిక వివరాలు, విద్యా సంబంధిత సమాచారాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రడక్షన్ వీడియోను రికార్డు చేసి పంపాలని సూచించారు. ఇందుకు సంబంధిత వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని తెలిపారు.

వివరాలు 

మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి

కాబట్టి, ప్రభాస్‌తో కలిసి నటించాలని ఆశించే వారు, మీ ఫోటో, ఇంట్రడక్షన్ వీడియోను వెంటనే రికార్డు చేసి పై తెలిపిన ఇమెయిల్ చిరునామాకు పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి! సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న "స్పిరిట్"లో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని కథనాలు వెల్లడిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్