Page Loader
Prabhas: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రం ప్రారంభం!
ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రం ప్రారంభం!

Prabhas: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రం ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2024
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

సందీప్ రెడ్డి వంగా, తన తొలి సినిమాతో అర్జున్ రెడ్డి ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, అదే సినిమాను హిందీ రూపంలో తెరకెక్కించి బీ టౌన్‌లో కూడా సంచలనాత్మక విజయాన్ని అందించాడు. ఇక బాలీవుడ్ నటుడు రన్ బీర్ కపూర్‌తో తీసిన యానిమల్ చిత్రం రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు, సందీప్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు, ప్రభాస్‌తో చేసే ఈ సినిమా, గత చిత్రాల కంటే మరింత వైలెంట్‌గా ఉంటుందని తెలిపాడు.

Details

సంగీత దర్శకుడిగా హర్షవర్దన్ రామేశ్వర్

తాజాగా, 'స్పిరిట్' అనే సినిమా పై పనిచేయడం ప్రారంభించాడట. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి స్పిరిట్ సినిమా సంగీత పనులను ప్రారంభించారు. ఈ సినిమా, 'డేషన్‌ డాషింగ్ పోలీస్ స్టోరీ'గా ఫిల్మ్ వేదికపై సందీప్ ప్రకటించారు. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించేందుకు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని విధంగా 'స్పిరిట్' చిత్రంలో మరింత వైల్డ్ అంశాలు ఉంటాయని తెలుస్తోంది.