Sankranthi Cinemas : సంక్రాంతి బరిలో సినిమాల జాతర.. ఏమేం విడుదలవుతున్నాయంటే
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు పండుగ లాంటిది. ఈ మేరకు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ వేళ, టాలీవుడ్ కొత్త సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఉవ్విళ్తూరుతుంటారు.
ఇటు రిపబ్లిక్ డే సందర్భంగానూ పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే జనవరిలో కొత్త సినిమాల సందడి ప్రారంభం కానుంది.
'సర్కారు నౌకరి'తో షురూ..
2024లో విడుదలైన తొలి చిత్రంగా దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన 'సర్కారు నౌకరి' గుర్తింపు తెచ్చుకుంది. గాయని సునీత కొడుకు ఆకాష్ హీరోగా, భావన వళపండల్ హీరోయిన్'గా తెరకెక్కింది.
1996లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపొందించారు. జనవరి 1న రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
Details
జనవరి 12న గుంటూరు కారం రిలీజ్
ఇక శివ కంఠమనేని, రాశి కలిసి నటించిన మూవీ 'రాఘవరెడ్డి' జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నందిత శ్వేత కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సంజీవ్ మేగోటి తెరకెక్కించారు.అదే రోజున మనోజ్, చాందిని జంటగా, నాగరాజు బోడెం దర్శకత్వంలో '14 డేస్ లవ్' విడుదల కానుంది.
ఇక మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం 'గుంటూరు కారం' జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది.
అదే రోజున తేజసజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన 'హనుమాన్' విడుదలవుతోంది.
వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను తెరకెక్కించిన 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న 'ఈగల్' జనవరి 13న రిలీజ్ కానున్నాయి.26న రజనీకాంత్ 'లాల్ సలామ్' విడుదలవుతోంది.