Sankranthiki Vasthunam: ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిన 'సంక్రాంతికి వస్తున్నాం'
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగ సందర్భంగా వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని సాధించిన అగ్ర కథానాయకుడు వెంకటేష్ (Venkatesh) ఈ పండగ సీజన్‌ను మరింత రంజుగా మార్చారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం వివిధ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది.
విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్న ఈ చిత్రం, ఐదవ రోజు రూ.12.75 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం,ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఐదవ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
వివరాలు
ఓవర్సీస్‌లో వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు
జాబితాలో మొదటి స్థానంలో ఉన్న చిత్రం 'ఆర్‌ఆర్ఆర్' (రూ.13.63 కోట్లు) కాగా, 'సంక్రాంతికి వస్తున్నాం' రెండో స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో 'అల వైకుంఠపురం' (రూ.11.43 కోట్లు), నాలుగో స్థానంలో 'బాహుబలి 2' (రూ.11.35 కోట్లు), ఐదో స్థానంలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏ.డి.' (రూ.10.86 కోట్లు) ఉన్నాయి.
ఇది కాకుండా,రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదలై మంచి ఆదరణ పొందింది.
ఓవర్సీస్‌లో ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
మొదటి రోజున 7 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా, రెండు మిలియన్ల మార్క్‌ను చేరుకుంది. వెంకటేశ్ కెరీర్‌లో ఇదే తొలిసారిగా ఇంత భారీ స్థాయి వసూళ్లు సాధించటం విశేషం.
వివరాలు
చిత్ర విజయంతో ఆనందంలో చిత్ర బృందం
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలోని నటుల అందరి ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్ర విజయంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది.
ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ప్రేక్షకులకు హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు.