సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
కుర్ర హీరో సంతోష్ శోభన్, బాక్సాఫీసు మీద ఒంటి చేత్తో పోరాటం చేస్తున్నాడనే చెప్పాలి. వరుసపెట్టి సినిమాలను వదులుతూనే ఉన్నాడు సంతోష్ శోభన్. అలా వచ్చిన సినిమానే శ్రీదేవి శోభన్ బాబు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, థియేటర్ల వల్ల తేలిపోయింది. కనీసం ఆడియన్స్ దృష్టిని తనవైపు తిప్పుకోలేకపోయింది. ఫిబ్రవరి 18వ తేదీన రిలీజైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుక్కుందని వినిపిస్తోంది. మార్చ్ 30వ తేదీ నుండి స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు.
ఆరు నెలల్లోనే మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్
శ్రీదేవి శోభన్ బాబు కథ విషయానికి వస్తే, సంతోష్ శోభన్ పాత్ర అనకాపల్లిలో అల్లరి చిల్లరగా ఉంటుంది. హీరోయిన్ గౌరీ పాత్ర ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తుంది. వీరిద్దరూ ఒక ప్రాపర్టీ విషయంలో గొడవ పడతారు. అది ఎక్కడికి దారి తీసిందనేదే కథ. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగబాబు, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఇక సంతోష్ శోభన్ విషయానికి వస్తే, ఈ సంవత్సరం సంక్రాంతి సమయంలో కళ్యాణం కమనీయం అంటూ వచ్చాడు. ఆ తర్వాత ఫిబ్రవరిలో శ్రీదేవి శోభన్ బాబు అన్నాడు. ఇప్పుడు అన్నీ మంచి శకునములే అంటూ మే 18వ తేదీన వస్తున్నాడు. ఈ సినిమాను నందినీ రెడ్డి డైరెక్ట్ చేసారు.