ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు'
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన కళ్యాణం కమనీయం సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం శివరాత్రి కానుకగా సంతోష్ శోభన్ బాబు నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. ఈ చిత్రంలో నాగబాబు, రోహిణి అన్నా చెల్లెళ్లుగా నటించారు. రోహిణి కొడుకు శోభన్ బాబు( సంతోష్ శోభన్).. నాగబాబు కుమార్తె శ్రీదేవి( గౌరి కిషన్) బావ మరదళ్లు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటేనే ఇల్లు దక్కుతుందని లేకుంటే అనాధాశ్రమానికి చెందుతుందని వాళ్ళ తాత వీలునామా రాస్తారు
శ్రీదేవి శోభన్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ
అయితే శ్రీదేవికి శోభన్ బాబు అంటే అసలు ఇష్టం ఉండదు. అయితే శ్రీదేవి ఓ సందర్భంలో శోభన్ బాబుతో ప్రేమలో పడుతుంది. అయితే శ్రీదేవిని శోభన్ బాబు పెళ్లి చేసుకొని ఇంటిని కాపాడుకున్నారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో సంతోష్ కామెడీ టైమింగ్ బాగుంది. హీరోయిన్ కూడా మంచి లుక్స్‌తో అదరగొట్టింది. నాగబాబు, రోహిణి కూడా తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ. ఇలాంటి కథలు చాలా సార్లు చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఐతే పరమ రొటీన్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్‌గా ఉందని చెప్పొచ్చు.