LOADING...
sathi leelavathi 2026 review: 'సతీ లీలావతి' మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
'సతీ లీలావతి' మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

sathi leelavathi 2026 review: 'సతీ లీలావతి' మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఎస్‌ఎంఎస్‌', 'భీమిలి కబడ్డీ జట్టు' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సత్య తాతినేని చాలా విరామం తర్వాత తెరకెక్కించిన చిత్రం సతీ లీలావతి. ఇందులో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించగా, పెళ్లి తర్వాత ఆమె నటించిన తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? అన్నది చూద్దాం.

వివరాలు

కథ ఏంటంటే..

లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్‌. చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవల కారణంగా ఆమె మనసులో భయం పెరుగుతుంది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్‌ రామ్ సేతు (దేవ్ మోహన్) సహాయం చేస్తాడు. ఆ పరిచయం ప్రేమగా మారి, చివరకు తండ్రి (నరేశ్ వీకే) సమ్మతితో పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లైన మూడేళ్లకే రామ్ సేతు విడాకులు కావాలని లీలావతిని కోరుతాడు. తాను నర్స్ నికోలా సెబాస్టియన్‌ (మడోన్నా సెబాస్టియన్‌)తో ప్రేమలో ఉన్నానని, ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నానని చెబుతాడు. దీంతో ఆగ్రహానికి గురైన లీలావతి అతడిని కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది.

వివరాలు

సినిమా ఎలా సాగిందంటే..

ఆ తర్వాత ఏమైంది? అసలు రామ్ సేతు నేపథ్యం ఏమిటి? లాయర్ తమలపాకుల (వీటీవీ గణేశ్), నిర్మాత మెట్ట రాజర్‌ (మెట్ట రాజేంద్రన్‌), దొంగ పాత్రలో కనిపించే సప్తగిరి కథలో ఎలా కీలకమయ్యారు? చివరికి లీలావతి - సేతు కలిశారా? విడిపోయారా? అన్నదే సినిమా కథ. భిన్న మనస్తత్వాలు కలిగిన భార్యాభర్తల కథను దర్శకుడు ఎంచుకున్నారు. మూడేళ్లకే వారి బంధం ఎందుకు దెబ్బతింది? ఒకరు విడిపోవాలని, మరొకరు ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాల్లో ఎవరు గెలిచారు? అనే అంశాన్ని తండ్రీ - కూతురు భావోద్వేగాలతో మేళవించే ప్రయత్నం చేశారు. అయితే దర్శకుడు సత్య తాతినేని కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విజయవంతం కాలేకపోయారు. లీలావతి నేపథ్యం,

Advertisement

వివరాలు

కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు

రామ్ సేతుతో ఆమె ప్రేమ, పెళ్లి, తర్వాత వచ్చే గొడవలు పెద్దగా ఉత్సుకత కలిగించవు. ముఖ్యంగా హీరో భార్య చేతిలో దెబ్బలు తిని ఇంట్లో బందీగా మారిన తర్వాత కథ మొత్తం ఒకే చోట తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వీటీవీ గణేశ్‌ పాత్ర ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేసినా, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్‌కు ముందు కథ కాస్త వేగం అందుకున్నా, విరామ ఘట్టాలు ఆసక్తి రేకెత్తించలేవు.

Advertisement

వివరాలు

ద్వితీయార్ధం గందరగోళం

సెకండ్ హాఫ్‌లో కథ మరింత గందరగోళంగా మారుతుంది. దొంగ పాత్రలో సప్తగిరి చేసే హంగామా, అతని సహాయంతో హీరో తప్పించుకోవాలనుకునే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. మధ్యలో వచ్చే లీలావతి కిడ్నాప్ డ్రామా, స్పైడర్‌మ్యాన్ తరహా యాక్షన్ సన్నివేశాలు కొంత కాలక్షేపం చేసినా, కథను బలంగా నిలబెట్టలేకపోయాయి. ప్రీక్లైమాక్స్‌లో కథ భావోద్వేగాలకు మళ్లినా, క్లైమాక్స్‌ను రియాలిటీ అడ్వెంచర్ గేమ్ తరహాలో తీర్చిదిద్దిన విధానం థ్రిల్ పంచలేకపోయింది.

వివరాలు

నటీనటుల ప్రదర్శన

లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి అందంగా కనిపించడమే కాకుండా, భర్తను కొట్టే సన్నివేశాల్లో కొంత వినోదం పంచింది. దేవ్ మోహన్ పాత్ర ఎక్కువగా ఒకేచోట పరిమితమైపోయినట్లు అనిపిస్తుంది. నరేశ్, మడోన్నా సెబాస్టియన్‌, వీటీవీ గణేశ్ తమ పాత్రల పరిధిలో నటించారు. సప్తగిరి, జాఫర్‌, తాగుబోతు రమేశ్ ఒకటి రెండు సన్నివేశాల్లో నవ్వులు పూయించారు. అయితే దర్శకుడు రాసుకున్న కథలో కొత్తదనం లేకపోవడం, భావోద్వేగాలు సరిగా పండకపోవడం చిత్రానికి పెద్ద మైనస్‌గా మారాయి.

వివరాలు

బలాలు

లావణ్య త్రిపాఠి నటన ద్వితీయార్ధంలోని కొన్ని కామెడీ సన్నివేశాలు బలహీనతలు కొత్తదనం లేని కథ బలహీనమైన భావోద్వేగాలు సాగదీత సన్నివేశాలు చివరగా.. భావోద్వేగాలతో కూడిన వైవాహిక కథను చెప్పాలన్న ప్రయత్నం కనిపించినా, ఆసక్తికరమైన కథనం లేకపోవడంతో సతీ లీలావతి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే చిత్రంగా మిగిలిపోయింది.

Advertisement