LOADING...
Zebra Movie: ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమైన సత్యదేవ్‌ 'జీబ్రా'.. ఎక్కడంటే?
ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమైన సత్యదేవ్‌ 'జీబ్రా'.. ఎక్కడంటే?

Zebra Movie: ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమైన సత్యదేవ్‌ 'జీబ్రా'.. ఎక్కడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ నటుడు సత్యదేవ్‌కి 'జీబ్రా' చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈశ్వర్ కార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వచ్చిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. థియేటర్‌లో మంచి విజయాన్ని సాధించిన 'జీబ్రా' చిత్రం ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ఆహా ఈ చిత్రాన్ని త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Details

త్వరలోనే విడుదల తేదీ ప్రకటన

ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రంతో సత్యదేవ్ తన నటనకు మరోసారి మంచి ప్రశంసలు అందుకున్నారు. సినిమా కథ, సస్పెన్స్ ఎలిమెంట్స్, ఈశ్వర్ కార్తీక్‌ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులను మెప్పించాయి. 'జీబ్రా'లో సత్యదేవ్ పాత్ర, చిత్రంలో సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్వీట్ చేసిన ఆహా