Page Loader
Satyam Sundaram Movie Review: అనుబంధాలను పంచుకునే ప్రయాణంలా 'సత్యం సుందరం'.. కార్తి అరవిందస్వామి ఎలా నటించారంటే? 
అనుబంధాలను పంచుకునే ప్రయాణంలా 'సత్యం సుందరం'.. కార్తి అరవిందస్వామి ఎలా నటించారంటే?

Satyam Sundaram Movie Review: అనుబంధాలను పంచుకునే ప్రయాణంలా 'సత్యం సుందరం'.. కార్తి అరవిందస్వామి ఎలా నటించారంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2024
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

'96' చిత్రంతో మనసులను కదిలించిన దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్, ఆరేళ్ల తర్వాత 'సత్యం సుందరం'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించగా, సూర్య-జ్యోతిక దంపతులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి)కి తన పుట్టిన ఊరు, తాతల కాలం నాటి ఇళ్లు అంటే ఎంతో ప్రేమ. కానీ కుటుంబంలో జరిగిన మోసం వల్ల, తను యుక్తవయసులో ఊరిని విడిచి వైజాగ్‌కు వెళ్తాడు. 30 ఏళ్ల తర్వాత సత్యం ఒక కుటుంబ శుభకార్యం కోసం తన పుట్టిన ఊరికి తిరిగి వస్తాడు.

Details

కార్తి, అరవింద్ స్వామి నటన హైలెట్

అక్కడ తనకు బావ అని పలకరిస్తూ, అన్యమనస్కతను పంచుకునే ఓ వ్యక్తి (కార్తి)తో పరిచయం ఏర్పడుతుంది. అతని అసలైన గుర్తింపేమిటో, తనతో అతని బంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఈ కథ. ఈ సినిమా సాహజీవన కథల హంగులకు మేలు కలిగించేలా రాసిన నాటకం కాదు. దర్శకుడు ప్రేమ్‌కుమార్ ఈ సినిమాను ఒక ప్రశాంతమైన నదిలా మెల్లగా సాగించిన తీరు ప్రశంసనీయం. ఇది ప్రేక్షకుల్ని గతకాలపు ఊహాలోకాల్లోకి తీసుకెళ్లుతుంది. సత్యం పాత్ర పరిచయం, అతని గ్రామంతో ఉన్న అనుబంధాన్ని చూపించడం, కార్తి పాత్ర హాస్యమయ, భావోద్వేగభరిత సన్నివేశాలను క్రమంగా నడిపిన విధానం బాగుంది. ద్వితీయార్థంలో సత్యం, కార్తి ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ మరింత లోతుగా సాగుతుంది.

Details

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతం

కార్తి తన పాత్రలో అల్లరి, నవ్వులు పూయించడమే కాకుండా, తన భావోద్వేగాలను సరిగ్గా పలికించి తన పాత్రకు జీవం పోశాడు మరోవైపు అరవింద్ స్వామి ఆత్మాన్వేషణలో ఉండే వ్యక్తిగా తన సూటి నటనతో ప్రేక్షకులని కట్టిపడేశారు. ఈ ఇద్దరి నటుల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు మనసును హత్తుకునేలా చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇందులో కథ, కార్తి, అరవింద స్వామి నటన, సంగీత సినిమాకు ప్లస్‌గా నిలిచింది. అయితే నెమ్మదిగా సాగే కథనం ఈ చిత్రానికి బలహీనతగా మారింది.