ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న చిత్రం ఏజెంట్ నుండి సెకండ్ సాంగ్ ఇంతకుముందే రిలీజ్ అయ్యింది.
రొమాంటిక్ నంబర్ గా కనిపిస్తున్న ఈ పాటలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణ యాసలో వచ్చిన పాటల్లో ఎక్కువ శాతం మాస్ సాంగ్సే ఉన్నాయి.
కానీ మొదటిసారిగా తెలంగాణ యాసలో రొమాంటిక్ టచ్ ఇచ్చారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ పాటను తెలంగాణ యాసలోని పదాలతో చెప్పడం అద్భుతంగా ఉంది.
పాటలోని పదాలెంత అందంగా వినిపిస్తున్నాయో, లిరికల్ వీడియోలో అక్కడక్కడా కనిపించే దృశ్యాలు కూడా అంతే అందంగా రొమాంటిక్ గా కనిపిస్తున్నాయి. చూస్తుంటే మొదటి పాట క్రియేట్ చేయలేని బజ్, ఈ పాట క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
ఏజెంట్
అకాడమీ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ కలంలోంచి వచ్చిన పాట
ఏందే ఏందే ఎట్నో ఐతాందే అంటూ సాగే ఈ పాటను అకాడమీ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాసారు. "అరె గాయి గాయి ఐపోతాందే నువ్వే సెయిపడితే, నా సేతిలో సెయ్యేస్తే, నను నడిపిస్తా ఉంటే" వంటి పదాలతో పూర్తిగా తెలంగాణ యాసలో రాసారు.
హిప్ హాప్ తమిజ్ అందించిన సంగీతం అద్భుతంగా సెట్ అయ్యింది. ఈ పాటను సంజిత్ హెగ్డే, హిప్ హాప్ తమిజ్, పద్మలత ఆలపించారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ చిత్రం, ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సరెండర్ 2 సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏందే ఏందే అంటూ సాగే రెండవ పాట రిలీజ్
The breezy romantic melody is here to make you all fall in love ❤️#EndheEndhe song is out now 🎶
— AK Entertainments (@AKentsOfficial) March 24, 2023
- https://t.co/mtplBYIG5Z
#Agent#AgentOnApril28th@AkhilAkkineni8 @sakshivaidya99 @DirSurender @boselyricist @hiphoptamizha @sanjheg @singerpadmalata @AnilSunkara1 @LahariMusic pic.twitter.com/6F8Hvq0qF0