
అన్నీ మంచి శకునములే సెకండ్ సింగిల్: అదిరిపోయిన మెలోడీ
ఈ వార్తాకథనం ఏంటి
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన అన్నీ మంచి శకునములే చిత్రం నుండి శ్రీరామ నవమి కానుకగా రెండవ పాట రిలీజ్ అయ్యింది.
సీతా కళ్యాణం అంటూ సాగే ఈ పాట చాలా మెలోడియస్, మధురంగా ఉంది. వింటున్న కొద్దీ ఇంకా నచ్చేలా అనిపిస్తుంది. శ్రీరామ నవమి రోజు రిలీజైన అచ్చమైన కళ్యాణం పాటలా అమృతంలా ఉంది.
ఈ పాటకు సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించగా, సాహిత్యాన్ని చంద్రబోస్ అందించారు. చైత్ర అంబడిపూడి, శ్రీకృష్ణ కలిసి పాడారు.
బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంకా దత్ నిర్మించింది. మే 18వ తేదీన రిలీజ్ కి సిద్ధం అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అన్నీ మంచి శకునములే సినిమా రిలీజైన మెలోడీ సాంగ్
Celebrate this #SriRamaNavami with us.
— Swapna Cinema (@SwapnaCinema) March 30, 2023
Here’s #SitaKalyanam from us to you ❤️
▶️ https://t.co/6l5hGZioiz#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @boselyricist @SwapnaCinema @VyjayanthiFilms @MitravindaFilms @SonyMusicSouth pic.twitter.com/oENtdWC2sS
సంతోష్ శోభన్
సంతోష్ శోభన్ ఈ సారైనా హిట్ కొడతాడా?
2023సంవత్సరంలో సంతోష్ శోభన్ నుండి వస్తున్న మూడవ చిత్రం ఇది. సంక్రాంతికి వచ్చిన కళ్యాణం కమనీయం, శివరాత్రి సమయంలో వచ్చిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.
మరి 2023లో అన్నీ మంచి శకునములే చిత్రంతో విజయం అందుకుంటాడో లేదో చూడాలి. ఈ విజయం ఆయన కెరీర్ కి చాలా అవసరం.
అలాగే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మాళవికా నాయర్ కు గతకొన్ని రోజులుగా సరైన హిట్ పడలేదు. మొన్న వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా బాక్సాఫీసు వద్ద ఉసూరుమంది.
అన్నీ మంచి శకునములే చిత్రం హిట్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. ఏం జరుగుతుందో చూడాలి.