ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఖుషి సినిమా వస్తోంది. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి రెండవ పాట రిలీజైంది.
నాతో రా ఆరాధ్య అంటూ మొదలయ్యే ఈ పాట, ఆరాధ్య అనే హుక్ లైన్ తో వినిపించింది. ఆరాధ్య అనే అమ్మాయిని హీరో పాత్ర ఎంతలా ఆరాధిస్తుందో ఈ పాటలో చెప్పేసారు.
నా గుండెను తవ్వీ తవ్వీ చందనమంతా చల్లగ దోచావే, వందలకొద్దీ పండగలున్నా, వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా.. నువ్వేలేనిదేదీ వద్దు ఆరాధ్య అనే వాక్యాలు హీరోయిన్ పాత్ర మీద హీరోకు ఎంత ఇష్టం ఉందో చెప్పేస్తున్నాయి.
లిరికల్ వీడియోలో సమంత, విజయ్ పాత్రల మధ్య మాంచి కెమిస్ట్రీ కనిపించింది.
Details
దర్శకుడు రాసిన పాట
ఇటు వినడానికి ఎంత హాయిగా ఉందో, అటు చూడడానికి అంతే హాయిగా ఉంది ఈ పాట. సిద్ శ్రీరామ్, చిన్మయి గొంతులు ఈ పాటను మరింత మధురంగా మార్చేసాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం వినసొంపుగా ఉంది.
ఈ పాటను రాసింది మరెవరో కాదు, ఖుషి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శివ నిర్వాణ కావడం చెప్పుకోవాల్సిన విషయం.
ఖుషి నుండి రిలీజైన నా రోజా నువ్వే పాటను కూడా శివ నిర్వాణ రాసారు. ఇప్పటివరకు రిలీజైన రెండు పాటలను దర్శకుడే రాయడం ఆసక్తి కలిగిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.